This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

స్తనంలో సిస్టు అంటే ఏమిటి: రకాలు, కారణాలు, లక్షణాలు & చికిత్స

Breast Lump
Written by - Sarada Ayyalaచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
స్తనంలో సిస్టు అంటే ఏమిటి: రకాలు, కారణాలు, లక్షణాలు & చికిత్స
Likes3 Likes|
Read time6 min

స్తనాలలో సిస్టులతో బాధపడుతున్న పేషెంట్లు స్తనాలలో సిస్టులు అంటే ఏమిటి అలాగే వారికున్న చికిత్స ప్రత్యామ్నాయాల గురించి తరచుగా ఆశ్చర్యపోవచ్చు. ఈ బ్లాగ్ పోస్ట్ వివిధ రకాల స్తనాల సిస్టులు, వాటి కారణాలు ఇంకా అందుబాటులో ఉన్న వివిధ చికిత్సా ప్రత్యామ్నాయాలని చర్చిస్తుంది. మరింత తెలుసుకోవడానికి ఇంకా చదవండి!

స్తనాలలో సిస్టులు అంటే ఏమిటి?

స్తనాలలో సిస్టులు స్తనాల యొక్క కణజాలం లోపల స్రావాలతో నిండిన తిత్తులు. అవి ఏ స్తనంలోనైనా రావచ్చు అలాగే గర్భ సమయంలో హార్మోన్ల మార్పులు లేదా మెనోపాజ్, ఇన్ఫెక్షన్, మంట, స్తనాలలో గాయాలు లేదా ఇదివరకటి గాయంతో వచ్చిన నొప్పి వంటి రకరకాల కారణాల వల్ల వస్తాయి. స్తనం యొక్క సిస్టు పరిమాణం సాధారణంగా అది కలిగివున్న ద్రవాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. స్తనాల యొక్క సిస్టులు మహిళలు, పురుషులలో ఇద్దరిలో కన్పిస్తాయి. అయినప్పటికీ, అవి యుక్తవయస్సు మరియు గర్భధారణ సమయంలో ఎక్కువ వస్తాయి కాబట్టి మహిళల్లో ఎక్కువ సాధారణంగా కనిపిస్తాయి. అంతేకాకుండా, ఏ వయస్సులోనైనా, ఏ జాతి, దేశం వారిలోనైనా ఇవి రావచ్చు కానీ ఇదివరకే గర్భం దాల్చిన లేదా తల్లిపాలు ఇవ్వడం వంటి చరిత్ర ఉన్న మహిళల్లో స్తనాల యొక్క సిస్టులు సర్వసాధారణం. స్తనాలలోని సిస్టులు చాలా రకాల పరిమాణాలు ఇంకా ఆకృతులలో ఉండవచ్చు, కొన్ని చాలా చిన్నవిగా ఉంటాయి, వాటిని స్తన కణజాలం యొక్క పైపైన మాత్రమే అనుభూతి చెందవచ్చు. గర్భ సమయంలో లేదా మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గినప్పుడు సిస్టులు ఏర్పడతాయి. అవి స్తనం లోపల గ్రంధి కణజాలం యొక్క అధిక పెరుగుదలకి (హైపర్ట్రోఫీ) సంబంధించినవి కూడా కావచ్చు.

మీకు ఇది కూడా నచ్చుతుంది: బ్రెస్ట్ (రొమ్ము) వ్యాధులు: రకాలు, లక్షణాలు, రోగనిర్దారణ

స్తనాల సిస్టుల యొక్క రకాలు

స్తనాల సిస్టులు అనేవి స్తనాలలో పెరిగే స్రావాలతో నిండిన తిత్తులు. ఇవి అపాయం లేనివి (క్యాన్సర్ లేనివి) కావచ్చు లేదా ప్రాణాంతకమైనవి (క్యాన్సర్ ఉన్నవి) కావచ్చు. ఏదేమైనా, స్తనాలలో సిస్టులు క్యాన్సర్గా మారే అవకాశం చాలా అరుదు. అనేక రకాల స్తనాల సిస్టులు ఉంటాయి కానీ స్తనాల సిస్టులలో ప్రధానంగా మూడు తరగతులు ఉంటాయి:

1. సాదా సిస్టులు: పేరు తెలుపుతున్నట్లుగా, ఇలాంటి సిస్టులు కేవలం స్రావంతో నిండి ఉంటాయి. ఇవి ఎప్పటికీ హానికరమైనవి కావు.

2. సంక్లిష్టమైన స్తనాల సిస్టులు: ఈ రకమైన సిస్టులలో, సిస్టులో ఉండే స్రావంతోపాటు అందులో తేలియాడే కొంత ఘనపదార్థం కూడా ఉంటుంది. అందుకని, నీడిల్ బయాప్సీ ద్వారా క్యాన్సర్ ఉండే కణాల పెరుగుదల ఉందేమో పరీక్షించి చూడాల్సి ఉంటుంది.

3. జటిలమైన స్తనాల సిస్టులు: సాధారణంగా 3 మిల్లీమీటర్ల కంటే పెద్దవైన ఫైబ్రోడెనోమాలను జటిలమైన స్తనాల సిస్టులు అంటారు. ఇవి క్యాన్సర్ ఉన్నవి కావచ్చు అందుకని నీడిల్ బయాప్సీతో చెక్ చేయాల్సి ఉంటుంది.

మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీ సమయంలో బ్రెస్ట్​లో గడ్డ.. ఎప్పుడు సీరియస్‌గా తీసుకుని వైద్యుడిని సంప్రదించాలి?

స్తనాల సిస్టుల యొక్క కారణాలు

స్తనాల సిస్టులు రావడానికి అనేక రకాల సాధ్యమయ్యే కారణాలు ఉంటాయి. అలాగే తరచుగా ఖచ్చితమైన కారణం కూడా తెలియదు. స్తనాల సిస్టులు హార్మోన్ల మార్పులు, గాయం లేదా ఇతర అంతర్లీన ఆరోగ్య పరిస్థితుల వలన రావచ్చు. స్తనాల యొక్క సిస్టులు రావటానికి కారణమయ్యే అత్యంత సాధారణ కారణాలలో హార్మోన్ల మార్పులు ఒకటి. యుక్తవయస్సు, గర్భం, మెనోపాజ్ లేదా గర్భనిరోధక మాత్రలు వంటి హార్మోన్ల మందులు తీసుకోవడం వంటి సమయాలలో కూడా ఈ సిస్టులు ఏర్పడవచ్చు. స్తనానికి ఇదివరకు గతంలో తగిలిన గాయం వలన కూడా సిస్టులు ఏర్పడవచ్చు. పరిగెత్తడం లేదా ఏదన్నా ప్రమాదం వలన జరిగే గాయాల వంటి పునరావృతమవ్వగలిగే సంఘటనల ద్వారా ఈ సిస్టులు రావచ్చు. చాలా అంతర్లీనమైన ఆరోగ్య సమస్యలు కూడా స్తనాల కింద సిస్టులు రావటానికి కారణమవుతాయి. ఇవి పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, ఫైబ్రోసిస్టిక్ స్తనాల మార్పులు అలాగే కొన్ని రకాల క్యాన్సర్లు కావచ్చు.

స్తనాల సిస్టుల యొక్క లక్షణాలు

స్తనాలలో సిస్టులు సాధారణంగా ఏ లక్షణాలు చూపించవు, కాకపోతే స్తనంలో ఏదో గడ్డలాగా అయితే అన్పించవచ్చు. కానీ ఒకవేళ ఒక స్తనం సిస్టు పగిలి, ఇన్ఫెక్షన్ లేదా స్రావం జరుగుతూ ఉంటే మాత్రం, అది తీవ్ర పరిస్థితిని సూచిస్తుంది, దానికి వెంటనే తప్పనిసరిగా డాక్టరు చికిత్స అవసరం అవుతుంది. స్తనాలలో సిస్టుల యొక్క ఇతర లక్షణాలలో స్తనంలో గడ్డలలాగా అన్పించటం, నొప్పితో కూడుకున్న స్తనపు సిస్టులు లేదా చాలా సున్నితంగా మారిపోయిన స్తనాలు, అలాగే స్తనం యొక్క కణజాలంలో మార్పులు ఉంటాయి. సిస్టులు సాధారణంగా అపాయకరమైనవి కావు, అంటే అర్థం క్యాన్సర్గా మారవు. కానీ కొన్ని సందర్భాలలో, సిస్టు క్యాన్సర్ కి దారితీయవచ్చు. ఒకవేళ ఎవరికైనా స్తనాల సిస్టుల లక్షణాలు ఉంటే, క్యాన్సర్ లేదు అని నిర్థారించుకోవటానికైనా డాక్టరుని తప్పనిసరిగా కలవడం చాలా ముఖ్యం.

స్తనాల సిస్టులని నయం చేయడానికి చికిత్స ప్రత్యామ్నాయాలు

సిస్టు యొక్క తీవ్రతని బట్టి స్తనాల సిస్టుల చికిత్సకి కొన్ని వేర్వేరు చికిత్సా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకవేళ స్తనంలో ఉన్న సిస్టు చిన్నగా ఉంటే అలాగే ఏ నొప్పి కలగచేయకుండా ఉంటే, ఆ పేషెంటు యొక్క డాక్టరు దాన్ని అలానే వదిలివేయమని సూచించవచ్చు. కొన్ని కేసులలో, సిస్టు అదంతట అదే తగ్గిపోతుంది. ఒకవేళ సిస్టు పెద్దసైజులో ఉండి లేదా నొప్పి కలిగిస్తూ ఉంటే, డాక్టరు ఆ సిస్టుకి రంధ్రం చేసి తీసివేయాలని సూచించవచ్చు. అందులో డాక్టరు స్తనపు సిస్టులో సూది గుచ్చి, లోపలి ద్రవాన్ని మొత్తం బయటకి లాగేయటం జరుగుతుంది. ఇది సాధారణంగా డాక్టరు క్లినిక్లోనే జరుగుతుంది. ఒకవేళ సిస్టు పెద్దగా ఉండి, ఈ రంధ్రం పెట్టే పద్ధతికి స్పందించకపోతే, పేషెంటుకి ఆ సిస్టుని పూర్తిగా తొలగించటానికి ఆపరేషన్ అవసరమని సూచించవచ్చు. ఇది ఇంక ఏ ప్రత్యామ్నాయం లేనప్పుడు ఆఖరుగా పాటించే పద్ధతి.

చివరిమాట

స్తనాలలో సిస్టులు స్తనాలపై స్రావాలతో నిండిన తిత్తులతో ఏర్పడతాయి. ఈ సిస్టులు నొప్పి కలిగిస్తూ, అందవికారంగా కూడా ఉంటాయి, కానీ సాధారణంగా క్యాన్సర్ అపాయం లేనివి. స్తనాల సిస్టులు సాధారణంగా చిన్నవిగా ఉంటాయి అలాగే ఎటువంటి సమస్యలను కలిగించవు, కానీ చికిత్స చేయకుండా వదిలేస్తే అవి మన రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసేంత పెద్దవిగా మారతాయి. ఏదేమైనా, స్తనాల సిస్టులు క్యాన్సర్‌గా గుర్తించబడిన సందర్భాలు కూడా ఉన్నాయి; అందువల్ల మనం మన డాక్టర్లని సంప్రదిస్తూ ఎప్పటికప్పుడు స్తనాల సిస్టులని చెక్ చేయించుకుంటూ ఉండాలి. ఒక సాధారణ మామోగ్రామ్ లేదా నీడిల్ బయాప్సీ మీకు వచ్చిన సిస్టు అపాయం లేనిదా లేదా ప్రాణాంతకమైనదా అని నిర్ధారించడంలో సహాయపడుతుంది. చివరగా, ఎవరికైనా స్తనాలలో సిస్టుల గురించి ఆందోళన కలిగి ఉంటే, డాక్టరుని సంప్రదించండి.

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.